గుకేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు
చెస్ ఛాంపియన్ డి.గుకేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు
చెస్ ఛాంపియన్ డి.గుకేష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. నార్వే చెస్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి గుకేష్ సాధించిన చారిత్రక విజయానికి అభినందనలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశఆరు. గుకేష్ అసాధారణ ప్రతిభ, పట్టుదల చూపించారని చంద్రబాబు నాయుడు కొనియాడారు.
ఏపీలోనూ క్రీడాకారులకు...
ఆంధ్రప్రదేశ్ లోనూ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న చంద్రబాబు క్రీడాకారులు మరింతగా రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని ఆయన ఆకాంక్షించారు. చిన్న వయసు నుంచే క్రీడల పట్ల ఆసక్తి కనపర్చిన వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించి వారిని ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.