ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపలనకు రావాలంటూ ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీన అమరావతి రాజధాని నిర్మాణపనులకు శంకుస్థాపనకు రావాలంటూ చంద్రబాబు ఆహ్వానాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు.
వస్తానంటూ....
తప్పకుండా వస్తానని, వచ్చి రాజధాని రూపుదిద్దుకునేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా చంద్రబాబుకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. రాజధాని నిర్మాణం పూర్తియితే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి వైపు పయనిస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్యచర్చ జరిగింది.