రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Update: 2025-07-14 03:42 GMT

అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తాపడి తొమ్మిి మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకోవాలని కోరారు.

గాయపడినవారికి...
గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. రాజంపేట ఆసుపత్రిలోనే మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపిన అధికారులు అవసరమైతే మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికొచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమన్న చంద్రబాబు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.


Tags:    

Similar News