బాలకృష్ణకు చంద్రబాబు విషెస్
నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు
నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం దక్కడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది తెలుగు వారికి గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. కళల విభాగంలో పద్మభూషణ్ పురస్కారం పొందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ద్వారా హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
సేవతో పాటు కళలను...
లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయాలు మరియు దాతృత్వంలో రాణించారన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకితభావాన్ని లెక్కలేనన్ని జీవితాలను తాకిందని మరియు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. ఇది నిజమైన ఐకాన్ మరియు దయగల నాయకుడికి దక్కిన గౌరవమని చంద్రబాబు అన్నారు.