Chandrababu : నేడు గృహప్రవేశం చేసిన చంద్రబాబు.. అందరికీ విందు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి వచ్చారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గృహప్రవేశం చేశారు

Update: 2025-05-25 02:41 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి వచ్చారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గృహప్రవేశం చేశారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తన సొంత ఇంటిని నిర్మించుకున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు గెలిపించిన ప్జలకు మరింత చేరువగా ఉండాలని నిర్ణయించుకున్న చంద్రబాబు గత ఎన్నికలకు ముందే కుప్పం లో ఇంటి కోసం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో చంద్రబాబు వచ్చినప్పుడు ఉండేందుకు వీలుగా ఇంటిని నిర్మించుకున్నారు.

సొంత ఇంటి గృహప్రవేశంలో...
చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించినప్పుడల్లా ఆర్ అండ్ బి అతిథి గృహంలోనో, బస్సులోనో ఉండాల్సి ఉంటుంది. తనను ఎనిమిది సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత ఊరు చేసుకోవాలని భావంచిన చంద్రబాబు అక్కడే ఇంటిని నిర్మించుకున్నారు. నేడు చంద్రబాబు ఈ ఇంట్లో గృహప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు. ఢిల్లీ నుంచి రుగా ఆయన కుప్పంనియోజకవర్గానికి చేరుకుని గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని ముఖ్యనేతలకు ఆహ్వానాలు పంపారు. ఇంటింటికీ తిరిగి నేతలు గృహప్రవేశానికి రావాలని ఆహ్వానించారు.
రెండు ఎకరాల్లో ఇల్లు...
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద రెండు ఎకరాల స్థలంలో ఇంటిని నిర్మించారు. ఈరోజు తెల్లవారు జామున గృహప్రవేశం చేయనున్నారు. అందరీకీ భోజనాలను ఏర్పాటు చేశారు. దాదాపు పాతికవేల మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఇంటి వద్ద బంధువులు, వీఐపీలకు షెడ్లు వేసి భోజనాలను వడ్డించారు. విందు భోజనంలో సంప్రదాయ వంటకాలు వడ్డించనున్నారు. చక్కెర పొంగలి, జిలేబి, తాపేశ్వరం కాజా, సమోసా, వెజ్ బిర్యానీ, టమోటా రైస్, రైతా, మ్యాంగో రైస్, గుత్తి వంకాయ మసాలా, మష్రూమ్ గుజ్జు కూర, బెండకాయ, బంగాళాదుంప కూరలతో పాటు వడలతో పులుసును కూడా వడ్డించనున్నారు. రైస్ తో పాటు సాంబారు, రసం, ఆవకాయ, గోంగూర పండుమిరపకాయ పచ్చడి, అప్పడం, పెరుగుతో పాటు క్యారెట్ హల్వా, ఐస్ క్రీమ్ అందరికీ అందించనున్నారు.


Tags:    

Similar News