Chandrababu : రేపు కడప జిల్లాకు చంద్రబాబు

ఈనెల 18న సీఎం చంద్రబాబు గుంటూరు, కడప జిల్లాల పర్యటించనున్నారు.

Update: 2025-01-17 02:39 GMT

ఈనెల 18న సీఎం చంద్రబాబు గుంటూరు, కడప జిల్లాల పర్యటించనున్నారు. గుంటూరులో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును కూడా చంద్రబాబు ప్రారంభించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను ఇటుఅధికారులు, అటు పార్టీ నేతలు చేస్తున్నారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో...
మరోవైపు ఈ నెల 18వ తేదీన కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. చంద్రబాబు కడప జిల్లాకు వస్తుండటంతో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు కడప జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News