నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలెప్మెంట్‌పై సమీక్షను నిర్వహించనున్నారు. సీఆర్డీఏ పై కూడా చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. ల్యాండ్ పూలింగ్, రాజధాని అమరావతి పనుల పురోగతిపై చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు.
పార్టీ కార్యాలయానికి...
మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. నేతలతో సమావేశమవుతారు. సాయం 4.40 గంటలకు విజయవాడు పీబీ సిద్ధార్థ కాలేజీకి వెళ్తారు. సాయంత్రం ఐదు గంటలకు సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ వేడుకల్లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి రాత్రి 7.15 గంటలకు నివాసానికి చేరుకుంటారు