Chandrababu : నేడు చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.25 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. ముందుగా తీసుకున్న అపాయింట్ మెంట్లతో అధికారులను, మంత్రులను కలవనున్నారు. అనంతరం వివిధ శాఖలపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు.
శాఖలపై సమీక్ష...
ఉదయం 11.30 గంటలకు మైన్స్, రెవెన్యూ జనరేషన్, ఉచిత ఇసుకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తారు. ఉచిత ఇసుక అమలు జరుగుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకుంటారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఎలా ఉందన్న దానిపై చంద్రబాబు ఈ సమీక్ష చేయనున్నారు. అనంతరం 12.30 గంటలకు కార్మిక సంక్షేమ శాఖపై సమీక్షను నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలలోని తన నివాసానికి చేరుకుంటారు.