జగన్ కు ఓట్లు అడిగే అర్హత లేదు

శాసనమండలి రద్దుకు తీర్మానం చేసిన జగన్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

Update: 2023-02-21 11:54 GMT

శాసనమండలి రద్దుకు తీర్మానం చేసిన జగన్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మండలి దండగ, ప్రజాధనం దుర్వినియగమవుతుందన్న జగన్ ఇప్పుడు మండలి అభ్యర్థులను గెలిపించాలని ఎలా కోరుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ తీవ్రఅసహనంలో ఉన్నాడన్న చంద్రబాబు అందుకే హింసకు దిగుతున్నాడని ఆరోపించారు. మండలి లాంటి వ్యవస్థలను జగన్ అగౌరవపర్చారని, ఇప్పుడు అదే ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను ఎలా నిలబెడతారని చంద్రబాబు నిలదీశారు.

టెలికాన్ఫరెన్స్ లో...
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, టీడీపీకి అనుకూల వాతావరణం ఉందని ఆయన తెలిపారు. ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అబ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్, వెస్ట్ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఉత్తరాంధర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావులను గెలిపించాలని చంద్రబాబు కోరారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడులు జగన్ ఆలోచనలకు, మనస్తత్వానికి నిదర్శనమన్న చంద్రబాబు, భయపడితే భయపడబోమని అన్నారు.


Tags:    

Similar News