Chandrababu : కనిగిరిలో చంద్రబాబు నాయుడు
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లికి చంద్రబాబు చేరుకున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లికి చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా యాభై ఎంస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఎంస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండో దశలో 329 ఎకరాల్లో పార్కులు ప్రారంభం కానున్నాయి.
పారిశ్రామిక పార్కులను...
ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ,ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవంలో భాగంగా కనిగిరి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు.