Chandrababu : నేడు మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

నేడు మూడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది

Update: 2025-09-24 04:42 GMT

నేడు మూడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె వివాహ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. అనంతరం విజయవాడలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలకనున్న చంద్రబాబు తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్లనున్నారు.

బ్రహ్మోత్సవాలకు...
అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. రేపు తిరుమలలో AI ఆథారిత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అలాగే శ్రీవారి ప్రసాదాలకు మిషన్ ప్లాంట్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు తిరిగి అమరావతికి చేరుకుంటారు. మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.


Tags:    

Similar News