Chandrababu : దగ్గుబాటిపై నాకు కొన్ని అనుమానాలు కలిగాయి : చంద్రబాబు
దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనను కలసి నప్పుడు తనకు కొన్ని అనుమానాలు కలిగాయని చంద్రబాబు అన్నారు
దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనను కలసి నప్పుడు తనకు కొన్ని అనుమానాలు కలిగాయని చంద్రబాబు అన్నారు. రాజకీయం నుంచి తప్పుకున్న తర్వాత ఎలా కాలం గడుస్తుందని ప్రశ్నించానని తెలిపారు. తనకు కూడా ఆ పరిస్థితి వస్తే ఎలా? అని ఆలోచించి ముందుగా ప్లాన్ చేసుకోవాలని ఆయనను ఈ విషయం అడగాల్సి వచ్చిందని అన్నారు. అయితే అందుకు తాను ఆనందంగా ఉండటానికి చాలా విషయాలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారని, ఇక తనకు కూడా ధైర్యం కలిగిందని అన్నారు.
రాజకీయాల నుంచి...
సాధారణంగా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్నా జనంలో ఉండటమే మేలని, దానికి విశ్రాంతి ఉండదని తెలిపారు. తాను దగ్గుబాటి వెంకటేశ్వరరావు నలభై ఏళ్లు కలిసి ఉన్నామని, ఎన్టీఆర్ వద్ద రాజకీయాలు నేర్చుకున్నామని చంద్రబాబు అన్నారు. ఎన్నికష్టాలున్నా వెంకటేశ్వరరావు బయటపడే వారు కాదని, ఆనందంగానే ఉంటారని ప్రశసించారు. ఆయన పుస్తకం రాయడంపై తనకు కొన్ని అనుమానాలు కలిగాయని, ఈ పుస్తకం మీరే రాశారా? అని నేరుగా ఆయననే అడిగానని చంద్రబాబు చమత్కరించారు.