Andhra Pradesh : నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్

నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-03-04 12:57 GMT

నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే వారి వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయో పరిమితిని 34 ఏళ్ల నంుచి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

యూని ఫామ్ ఉద్యోగాలకు...
యూని ఫామ్ ఉద్యోగాలకు మాత్రం వయో పరిమితిని రెండేళ్లు మాత్రమే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టంబరు లో జరిగే నియామకాలకు మాత్రమే ఈ వయో పరిమితి వర్తిస్తుందని తెలిపింది. గత కొన్నాళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి నిజంగా ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పినట్లే.


Tags:    

Similar News