Chandrababu : దివ్యాంగులకు చేయూతనిచ్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-12-04 02:27 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏడు రకాల వరాలను ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. అలాగే కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ లో నామినేటెడ్ పోస్టుల్లో అవకాశమిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎవరూ దివ్యాంగులు గెలవకపోతే ఎక్స్ అఫిషియో మెంబర్ పదవిని కల్పిస్తామని చెప్పారు.

ఏడు వరాలుగా...
అలాగే దివ్యాంగులకు స్పెషల్ గా ఆర్థిక రాయితీలను కూడా కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. పందొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఇళ్లను కేటాయించనున్నట్లు చెప్పారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే పింఛన్లను పంపిణీ చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News