Ap Cabinet : కేబినెట్ సమావేశంలో ఆ మంత్రులకు బాబు వార్నింగ్

కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది

Update: 2025-03-07 13:08 GMT

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. అజెండా పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొందరు మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలను సక్రమంగా మేనేజ్ చేయలేకపోతున్నారని ఆయన గట్టిగానే మందలించినట్లు సమాచారం. ఉచిత ఇసుక, మద్యం విషయాల్లో ఎమ్మెల్యేలు తలదూరుస్తున్నా సరైన దిశగా చర్యలు తీసుకోవడం లేదని చంద్రబాబు కొందరు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లాల్లో జరుగుతున్న వాటిని గమనించకుండా నిద్రపోతే ఎలా అని కొంత కటువుగానే హెచ్చరించినట్లు తెలిసింది.

విపక్ష విమర్శలకు...
దీంతో పాటు విపక్షం చేసే విమర్శలకు కూడా కొందరు మంత్రులు ధీటుగా సమాధానం చెప్పడం లేదని, జనంలోకి వెళ్లేలా మంత్రులు ప్రయత్నించడం లేదని కూడా చంద్రబాబు కొందరు మంత్రులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రులు తమ శాఖ పరిధిలోకి వచ్చే అంశాలపై మాత్రమే స్పందించకుండా అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని జిల్లాల వారీగా జనంలోకి వాస్తవాలను తీసుకు వెళ్లాలని, అలా కాకుండా మౌనంగా ఉంటే విపక్షాలు చెప్పిన అవాస్తవాలు నిజమని నమ్ముతారని చంద్రబాబు అన్నట్లు తెలిసింది.


Tags:    

Similar News