Chandrababu : తుపాను ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు

Update: 2025-10-29 07:42 GMT

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తుపాను నష్టం తీవ్రతను పరిశీలించనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది.

ఓడరేవులో దిగి...
చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ చేయనున్నారు.కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో ముఖ్యమంత్రి కాసేపు ఆగుతారు. ఓడలరేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు.


Tags:    

Similar News