Chandrababu : నేడు గుంటూరు జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-11-07 03:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. తాడికొండ మండలంలోని లాంలో ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఆచార్య ఎన్జీ రంగా జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు.

అంతకు ముందు...
అంతకు ముందు ఇండియన్ క్రికెటర్ శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. మహిళల వరల్డ్ కప్ లో టీం ఇండియా జట్టులో ఉన్న కడప జిల్లాకు చెందిన శ్రీచరణి విజయవాడకు వచ్చి చంద్రబాబును కలవనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు శ్రీచరణికి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ప్రకటించనున్నారు.


Tags:    

Similar News