Andhra Pradesh : నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు

Update: 2025-10-21 02:40 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి దుబాయ్, అబుదాబి, యూఏఈలలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. ఆ దేశాల్లో ఉన్న తెలుగు వారితో సమావేశం కానున్నారు. వారిని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు.

విశాఖ సదస్సుకు...
నవంబర్ నెలలో విశాఖలో జరగనున్న సీఐఐ సమ్మిట్ కు పెట్టుబడిదారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం కల్పించనున్న రాయితీలను వివరించనున్నారు. పెట్టుబడుల కోసం ఆయన ప్రత్యేకంగా ఈ పర్యటన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనువైన ప్రాంతమని, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించనున్నారు.


Tags:    

Similar News