Chandrababu : నేడు అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-11-12 02:08 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో గృహప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. పక్కా గృహాల లబ్దిదారులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది.

టీడీపీ కార్యకర్తలతో...
అనంతరం సోషల్ మీడియా వారియర్స్ తో కూడా చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్కువ కృషి చేయాలని ఆదేశించనున్ారు. అలాగే సాయంత్రం అక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై చంద్రబాబు వారికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలతో పాటు కూటమిలోని అన్ని పార్టీలను కలుపుకుని నియోజకవర్గాల్లో ముందుకు వెళ్లాలని సూచించనున్నారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలకు అండగా ఉండాలని కోరనున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


Tags:    

Similar News