Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-10-27 03:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. వివిధ శాఖలపై సమీక్ష చేయనున్నారు. అలాగే తుపాను తో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10.15 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటారు. 10.30 గంటలకు ఆర్టీజీఎస్ నుంచి మొంథా తుఫాన్‌పై సమీక్షను చంద్రబాబు చేస్తారు.

తుపాను చర్యలపై...
తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన జిల్లా కలెక్టర్లతో ఆయన మాట్లాడతారు. తుపానుకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకుంటారు.మధ్యాహ్నం 12.40 గంటలకు వెల్దుర్తి వెళ్తారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు.. మధ్యాహ్నం 1.50 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 4.30 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్షిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News