Chandrababu : అందుకే విశాఖకు గూగుల్ వచ్చింది

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటమే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు

Update: 2025-10-21 04:41 GMT

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటమే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుందన్న చంద్రబాబు సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావన్నారు. అందుకే తాను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటానని చెప్పారు.

పెట్టుబడులు పెట్టేవారు...
పెట్టుబడులు పెట్టే వారు తమ పెట్టుబడులకు రక్షణ కోరుకుంటారని, పెట్టుబడులు పెడితే ఇబ్బంది ఉండదన్న నమ్మకం ఉంది కాబట్టే గూగుల్ సంస్థ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 15 బిలియన్ డాలర్ల అతిపెద్ద పెట్టుబడి వచ్చింది. ఏఐ డేటా విశాఖకు వచ్చిందని చంద్రబాబు వివరించారు. ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం ను అణిచివేయడంలో ఎంతో పేరు తెచ్చుకున్నారని చంద్రబాబు ప్రశంసించారు. కులాన్ని,మతాన్ని అడ్డుపెట్టుకుని ఘర్షణలు రేపే రాజకీయ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పోలీసులను కోరారు.


Tags:    

Similar News