Chandrababu : నేడు అబుదాబిలో చంద్రబాబు బిజీ బీజీ

రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు అబుదాబిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు

Update: 2025-10-23 04:21 GMT

రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు అబుదాబిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అబుదాబీలోని పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో వరుస భేటీలు జరపనున్నారు. ఈరోజు చంద్రబాబు తొమ్మిది మీటింగ్‌లు, విజిట్‌లలో పాల్గొననున్నారు. పెట్టుబడులపై స్థానిక పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో సమావేశమవుతారు.

వరస సమావేశాలతో...
జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ కానుంది. అబుదాబీ పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. లులూ గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీ, అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మెరీ, మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహితో వరుస భేటీలు జరపనున్నారు. యాస్ ఐ ల్యాండ్ లోని పర్యాటక ప్రాజెక్టులను సందర్శించనున్న చంద్రబాబు బృందం తర్వాత భారత కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్ధం ఇచ్చే విందులో పాల్గొననున్నారు. నవంబరులో జరిగే పెట్టుబడుల సదస్సుకు రావాలని ఆహ్వానించనున్నారు.


Tags:    

Similar News