సంక్రాంతికి ఏపీకి 30 లక్షల మంది వచ్చారు : చంద్రబాబు

ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపా

Update: 2026-01-17 12:48 GMT

ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌లోని స్వస్థలాలకు వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు శంకుస్థాపన నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలు పండగ కోసం ఏపీకి వచ్చాయన్నారకు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించారన్న చంద్రబాబు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయటం సంతోషదాయకమని అన్నారు. ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ప్రారంభించిన ప్రమోటర్లకు అభినందనలు తెలియచేస్తున్నాని, గత ఏడాది గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని, 2027 జూన్ కల్లా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని చంద్రబాబు తెలిపారు.

చరిత్ర తిరగరాయడం...
చరిత్ర తిరగ రాయటం తెలుగువాళ్ల వల్లే సాధ్యం అవుతుందని మరోమారు నిరూపితం అవుతోందన్నారు. కాకినాడ నుంచి గ్రీన్ అమోనియా సరఫరా జర్మనీకి సరఫరా అవుతుందన్న చంద్రబాబు గతంలో గ్రే అమోనియా తయారీని నాగార్జునా ఫెర్టిలైజర్స్ చేపట్టిందని , ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రీన్ అమోనియా తయారు చేసి పర్యావరణ హిత ఉత్పత్తులు తయారవుతాయన్నారు. పర్యావరణ సమతుల్యత సాధించటమే ప్రస్తుతం ఉన్న లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రకృతి విపత్తులుసముద్ర మట్టాలు పెరగటం వల్ల భూమి కోతకు గురవుతోందని చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారని, ఆయన లక్ష్యాన్ని అందిపుచ్చుకుని ఏపీలో 160 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని తయారు చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని అన్నారు. బలమైన సంకల్పం ఉంటేనే ఏదైనా సాధించగలమన్నారు.


Tags:    

Similar News