బనకచర్ల ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
బనకచర్ల ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది
బనకచర్ల ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సమాధానం ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టును ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రబుత్వం చెప్పిందని, ప్రాజెక్టు ప్రారంభించలేదని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాజ్యసభలో సమాధానమిచ్చింది.
ఇతర రాష్ట్రాల అభిప్రాయాలను...
బనకచర్ల ప్రాజెక్టు కు సంబంధించి ఇతర పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామని చెప్పింది. బనచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కూడా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను కూడా లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి అందచేసిందని చెప్పింది.