బెజవాడకు మరో ప్రత్యేక కార్యాలయం
విజయవాడలో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది
విజయవాడలో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ బెంచ్‌కు చెందిన సర్క్యూట్ బెంచ్‌ను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం పదకొండు గంటలకు వర్చువల్ విధానంలో ఈ సర్క్యూట్ బెంచ్‌ను ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు.
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోసం...
ఇప్పటి వరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోసం హైదరాబాద్ కేంద్రంగా అఖిల భారత సర్వీసు అధికారులు తరచు వెళ్లేవారు. ఇక విజయవాడలో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖిల భారత స్థాయి అధికారులు.. ప్రభుత్వ బదిలీలు తదితర అంశాలపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్న సీఏటీ ఏర్పాటుతో కొంత ఊరట కలుగుతుంది.