భాస్కర్ రెడ్డి అరెస్ట్‌లో సీబీఐ ఏమన్నదంటే

వైఎస్ వివేక హత్యకేసులో సీబీఐ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి ను అరెస్ట్ చేశామన్నారు

Update: 2023-04-16 04:13 GMT

వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి ను అరెస్ట్ చేశామన్నారు. మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని తెలిపారు. సెక్షన్ 120 B , రెడ్ విత్ 302 , 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

పాత్ర కీలకం...
వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. వివేకా హత్య కు ముందు, తరువాత నిందితులకు భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడారని, అందుకు తగిన ఆధారాలున్నాయని పేర్కొంది. వైఎస్ లక్ష్మీ, పీ జనార్దన్ రెడ్డి, సాక్షులుగా 120b కుట్ర , 302 మర్డర్ , 201 ఆధారాలు చేరిపివేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News