వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదయింది
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. పోలీసులను బెదిరించారని అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణను నిరసిస్తూ వైసీపీ నేతృత్వంలో గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. అయితే అక్కడున్న బ్యారికేడ్లను అంబటి రాంబాబు తొలగించారు.
పోలీసుల విధులకు...
దీంతో అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదు అయింది. అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్ కు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించారని పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుతోపాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.