పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై కేసు నమోదు

పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై కేసు నమోదు

Update: 2025-05-15 02:31 GMT

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు. పుంగననూరు నియోజకవర్గంలోని మంగపేట అటవీ భూమి ఆక్రణపై చర్యలు తీసుకోవడంలో భాగంగా అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాజంపేట్ ఎంపీ మిధున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడు భార్య ఇందిరమ్మపై కేసు నమోదు చేశారు.

మంగళపేట అటవీ ప్రాంతంలో...
మంగళపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాలను ఆక్రమించినట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల ఈ నెల 6వ తేదీన దీనిపై కేసు నమోదు చేశఆరు. అయితే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News