ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు
గుంటూరు నగరంపాలెం స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదయింది
గుంటూరు నగరంపాలెం స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదయింది. జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదయింది. .
పవన్ పై చేసిన వ్యాఖ్యలకు...
దువ్వాడ వ్యాఖ్యల పట్ల మనస్తాపం చెంది తాను ఫిర్యాదు చేశానని అడపా మాణిక్యాలరావు తెలిపారు. ఇప్పటికే అనేక చోట్ల దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో దువ్వాడ శ్రీనివాస్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ కావడంతో నిబంధనల మేరకు విచారణ జరుపుతామని అంటున్నారు.