నేడు రాజధాని భూకేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ

రాజధాని అమరావతి ప్రాంతంలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది

Update: 2025-05-06 06:03 GMT

రాజధాని అమరావతి ప్రాంతంలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. సచివాలయంలో జరిగే భేటీకి హాజరుకానున్న నారాయణ, పయ్యావుల, కందుల దుర్గేష్ హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించిన భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించనుంది.

కేబినెట్ సమావేశంలో...
రాజధాని అమరావతిలోని వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయం మంత్రివర్గ కమిటీ సమావేశం తీసుకోనుంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకొనే నిర్ణయాలను కేబినెట్ ముందు ఉంచనున్న ప్రభుత్వం దానిని ఆమోదించే అవకాశాలున్నాయి. భూకేటాయింపులపై నేడు తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.


Tags:    

Similar News