Andhra Pradesh : జిల్లాల పునర్విభజనపై నేడు మంత్రి వర్గ ఉపసంఘం భేటీ
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం నేడు సమావేశం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం నేడు సమావేశం కానుంది. రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలతో పాటు, జిల్లాలను పునర్విభజన చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై అధ్యయనం చేయడానికి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏ్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు ఇప్పటికే జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు.
ఈ నెల 10న జరిగే...
కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, మార్పులు, చేర్పులపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నెల 10వ తేదీన మంత్రి వర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులు తాము జిల్లాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలను తెలిపారు. దీనిపై నేడు సచివాలయంలో సమావేశమై మంత్రి వర్గ ఉప సంఘం చర్చించనుంది.