Andhra pradesh : నవంబరు 7న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నవంబరు 7వ తేదీన జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నవంబరు 7వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కొన్ని ముఖ్యమైన అంశాలను ఆమోదించనున్నారు. ప్రతి నెల రెండు సార్లు ఏపీ కేబినెట్ భేటీ సమావేశం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీన మంత్రివర్గ సమావేశం జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం అజెండాను పంపాలని అన్ని శాఖల అధికారులకు జీఏడీ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖ సదస్సుపై...
ఈ మంత్రి వర్గ సమావేశంలో ప్రధానంగా నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సదస్సుపై చర్చించనున్నారు. సదస్సుపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన నేపథ్యంలో కమిటీ సూచనలపై కూడా కేబినెట్ భేటీ లో చర్చించనున్నారు. దీంతో పాటు రాజధాని అమరావతి పనులు, భూముల కేటాయింపులపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.