Kurnool Bus Accident : కర్నూలు వద్ద దహనమైన బస్సులో బంగారం కోసం?
కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సు వద్ద బంగారం కోసం ప్రజలు వెతుకుతున్నారు.
కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సు వద్ద బంగారం కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లా చిన టేకూరువద్ద వేమూరి కావేరి బస్సు అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 19 మంది సజీవదహనమయ్యారు. అయితే వారి వంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు కరిగిపోయి అక్కడ పడి ఉంటాయని భావించి దహనమైన బస్సులో వెతుకుతున్నారు. అక్కడ పోలీసులు కూడా లేకపోవడంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి బస్సులోపలికి వెళ్లి బంగారం ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి...
మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది ఈ బస్సులో బంగారం కోసం వెతుకున్నారు. బంగారం ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చామని, చిన్న ముక్క దొరకకపోతుందా? అన్న ఆశతో అంత దూరం నుంచి వచ్చామని చెబుతున్నారు. ఒకవైపు విషాదంతో పందొమ్మిది మంది చనిపోతుంటే సందట్లో సడేమియా అన్నట్లు బంగారం కోసం వెతుకుతున్న వారిని పోలీసులు కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇలాంటి వాటిని గట్టిగా నిరోధించాలని ఆ ప్రాంత వాసులు గట్టిగా కోరుతున్నారు.