Devaragattu : దేవరగట్టు కర్రల యుద్ధం హింసాత్మకం.. ఇద్దరు మృతి.. వంద మందికి గాయాలు
కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం హింసాత్మకంగా మారింది. ఇద్దరు మరణించారు
కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం హింసాత్మకంగా మారింది. ఇద్దరు మరణించారు. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు లో జరిగిన కర్రల యుద్ధంలో ఇద్దరు మరణించగా వందలాది మందికి గాయాలయ్యాయి. విజయదశమి రోజున మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల కోసం గ్రామస్థులు పోటీ పడతారు. కర్రలతో యుద్ధానికి దిగుతారు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడగా అందులో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. గురువారం అర్ధారాత్రిన స్వామి, అమ్మవార్ల వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది.
గాయపడిన వారిలో
ఆ తర్వాత దేవతాముూర్తులను తీసుకెళ్లే విషయలో గ్రామ ప్రజలు పోటీ పడ్డారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. కర్రలతో బీభత్సంగా దాడులు చేసుకోగా ఇద్దరు మరణించగా, వంద మందికిపైగానే భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయిన వారిని ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు మరణించడంతో పోలీసులు ప్రాధమికంగా కేసు నమోదు చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.