KTR : చంద్రబాబుకు తాకట్టుపెట్టడానికే రేవంత్ సిద్ధమయ్యారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-07-18 08:00 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటిని చంద్రబాబు కు కట్టబెట్టే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు. మొన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో బనకచర్లపై చర్చ జరిగిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పినా, రేవంత్ రెడ్డి మాత్రం అసలు చర్చే జరగలేదని అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానితో కుమ్మక్కవుతున్నారని అన్నారు.

గోదావరి జలాలను...
రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. గోదావరి నదీ జలాలను కూడా ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు సమావేశంలో అంగీకరించుకుని వచ్చి కమిటీల పేరుతో నాటకం చేస్తున్నారని అన్నారు. కమిటీలు వేసేది, కేంద్ర ప్రభుత్వాన్ని ఆడించేది కూడా చంద్రబాబు అని అన్నారు. రేవంత్ రెడ్డి తాను విసిరిన సవాళ్లకు స్పందన లేకుండా పిచ్చిపిచ్చి మాటలను మాట్లాడుతున్నారని అన్నారు. అందరినీ మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులను నిలువునా ముంచేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారని, బీఆర్ఎస్ ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తుందని తెలిపారు.



Tags:    

Similar News