త్వరలో కేసీఆర్ ఏపీ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత బీఆర్ఎస్ ను ఏపీలో బలోపేతం చేసిన తర్వాత ఆయన సభలు ఉంటాయని చెబుతున్నారు. గుంటూరు, బెజవాడల్లో ఏదో ఒక చోట సభ జరిగే అవకాశముందని తెలిపారు. కేసీఆర్ సభలకు ముందు కొన్ని సభలను స్థానిక నేతల చేత ఏర్పాటు చేయించనున్నారు.
సభ్యత్వ నమోదు తర్వాత...
తొలుత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయనున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభించుకున్న తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని కూడా చూశారు. ఇక ఈరోజు కొందరు ముఖ్యనేతలు పార్టీలో చేరుతుండటం, తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ ఎపీ అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఏపీ పర్యటన తేదీలు ఖరారవుతాయని చెప్పారు.