నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశముందని తెలిసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశముందని తెలిసింది. తన తండ్రి కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు కవిత వెళుతున్నారు. ఇటీవల కాలంలో కవితకు, పార్టీ నేతలకు మధ్య అగాధం ఏర్పడిన నేపథ్యంలో నేడు కవిత ఎర్రవెల్లి ఫాం హౌస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.
చిన్న కుమారుడికి...
అయితే కల్వకుంట్ల కవిత తన చిన్న కుమారుడిని అమెరికాలో ఉన్నత చదువులు చేర్పించేందుకు రేపు అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో చిన్న కుమారుడికి ఆశీర్వచనాలు తీసుకునేందుకు కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత వెళ్లనున్నారని, అంతకు మించి రాజకీయాలు మాట్లాడే అవకాశముండదని తెలిపారు. కవిత అమెరికా పర్యటనలో పదిహేను రోజుల పాటు ఉండనున్నారు.