ఇప్పుడు ఇలా అంటున్నారా బ్రదర్ అనిల్!!

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్

Update: 2024-01-04 11:17 GMT

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సమర్థించారు. షర్మిల పక్కనే ఆయన వేదికపై ఉన్నారు. బ్రదర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ కుటుంబంలో తాము కూడా సభ్యులమే అని.. ఈ దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారని, కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని చెప్పారు. ఏపీలో కచ్చితంగా షర్మిల ప్రభావం ఉంటుందని అన్నారు. ఇక సీఎం జగన్ కు వ్యతిరేకంగా పని చేయమని హైకమాండ్ ఆదేశిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా... అధిష్ఠానం ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పారు.

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో పాటు.. కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు పాల్గొన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో వైఎస్ షర్మిల మెడలో కుండవా కప్పి మల్లిఖార్జున ఖర్గే ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె పక్కనే ఉన్న బ్రదర్ అనిల్ మెడలోనూ కండువా వేయబోయారు. అయితే బ్రదర్ అనిల్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి, కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి నిరాకరించారు. ఇదే విషయాన్ని షర్మికు సైగ చేసి చెప్పారు. వెంటనే షర్మిల ఆయన మెడలో కండువా వద్దు అంటూ ఖర్గేకు చెప్పగా.. దీంతో ఒక్కసారిగా ఖర్గే ఖంగుతున్నారు.


Tags:    

Similar News