ఆరోజున బ్రేక్ దర్శనాల రద్దు

Update: 2022-12-24 07:57 GMT

ఈ నెల 27న ఉదయం 6 నుండి 12 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో డిసెంబరు 27న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ ఉత్సవం కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ పేర్కొంది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఉగాది, అణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు సార్లు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని అంటారు. జనవరి 2వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 27న ఆలయ శుద్ధి చేయనున్నారు.

శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శుక్రవారం 63,055 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 23,044 మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి రూ.3.99 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే.. నిన్న వైకుంఠ దర్శనం టికెట్లను విడుదల చేసింది టిటిడి. ప్రతిరోజూ 2000 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. భక్తులు 10,000 విరాళంతో పాటు రూ.300 టికెట్టుకు చెల్లించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News