అసెంబ్లీ సమావేశాలకు ఆ ఇద్దరూ డుమ్మా

నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటువేసిన ఎమ్మెల్యేలు ఇద్దరూ ఈరోజు గైర్హాజరయ్యారు

Update: 2023-03-24 05:45 GMT

నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓటువేసిన ఎమ్మెల్యేలు ఇద్దరూ ఈరోజు గైర్హాజరయ్యారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో అసెంబ్లీ లాబీల్లో చర్చ జరుగుతుంది. అయితే ఉండవల్లి శ్రీదేవి మాత్రం తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని చెబుతున్నారు. అయితే ఈరోజు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై పెద్దయెత్తున అసెంబ్లీ లాబీల్లో చర్చ జరుగుతుంది.

తాము వేటు వేశామని...
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉన్నా చివరకు ఆయన లైన్ లోకి వచ్చారు. తనను వైసీపీ జయమంగళ వెంకటరమణకు తొలి ప్రాధాన్యత ఓటు వేయమని చెప్పారని, తాను ఆయనకే ఓటు వేశానని మేకపాటి చెబుతున్నారు. తాను ఎమ్మెల్యే పదవికి వైసీపీ నేత జగన్ కోసం రాజీనామా చేసి వచ్చానన్న విషయం అందరికీ తెలుసునని తెలిపారు. ఉండవల్లి శ్రీదేవి కూడా తాను దళిత మహిళననే ఈ ప్రచారం చేస్తున్నారని, వైసీపీ పార్టీకి కట్టుబడి ఉన్నానని ఆమె చెబుతున్నారు. ఆనం రామనారాయణరెడ్డి కూడా తాను వైసీపీకే ఓటు వేశానని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి క్రాస్ ఓటింగ్ పై చర్చ జరుగుతుంది.


Tags:    

Similar News