పవన్ రెండు సీట్లు ప్రకటనపై బొండా ఉమ ఏమన్నారంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు సీట్లు ప్రకటిస్తే టీడీపీకి లేని ఇబ్బంది వైసీపీకి ఎందుకని బొండా ఉమా ప్రశ్నించారు
bonda uma
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు సీట్లు ప్రకటిస్తే టీడీపీకి లేని ఇబ్బంది వైసీపీకి ఎందుకని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రశ్నించారు. తమకు లేని బాధ మీకెందుకన్నారు. అసలు తమ సీట్ల గురించి మీకు ఎందుకు బాధ అని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండు కాకపోతే నాలుగు సీట్లు పవన్ ప్రకటిస్తారని, వాటి గురించి మీరెందుకు బాధపడతారని అన్నారు.
మాకు లేని బాధ...
టీడీపీ, జనసేన పొత్తు విచ్ఛిన్నమవ్వాలని వైసీపీ నేతలు బలంగా కోరుకుంటున్నారని, అది మాత్రం జరగదని, అటువంటి ఆశలు పెట్టుకోవద్దని బొండా ఉమ వైసీపీ నేతలకు హితవు పలికారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూర్చుని మాట్లాడుకుని ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.