Amaravathi : గుడ్ న్యూస్.. అమరావతికి నిధులు వచ్చేస్తున్నాయ్... 30 వేల కోట్లు రెడీ

రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది.

Update: 2024-12-13 02:28 GMT

రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నెల19న బోర్డు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు సంయుక్తంగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొన్నాళ్ల క్రితం ప్రపంచబ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులు అమరావతి ప్రాంతానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి వివరాలను సేకరించారు.

ముప్ఫయివేల కోట్ల రూపాయలు...
అయితే ఏడీబీ బోర్డు ఆమోదం తెలపడంతో తొలివిడతగా వచ్చే నెలలో 3,750 కోట్ల రూపాయల నిధులు విడుదల కానున్నాయి. దీంతో పాటు రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి హడ్కో పదకొండు వేల రూపాయలు, బ్యాంకు కేడీఎఫ్ ఐదు వేల కోట్ల రూపాయల నిధులను ఇచ్చేందుకు అంగీకరించడంతో ఇక రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకోనున్నాయి. దీంతో మొత్తం ముప్ఫయి వేల కోట్ల రూపాయల నిధులను రాజధాని నిర్మాణ తొలి దశ పనులను చేపట్టేందుకు సిద్ధమయింది. ఈ నిధులతో నిర్మాణ పనులను చేపట్టనున్నారు. త్వరలో అసెంబ్లీ, సెక్రటేరియట్, రోడ్లకు సంబంధించి టెండర్ల ను ఆహ్వానించే ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
చంద్రబాబు బాధ్యతలను స్వీకరించగానే...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలను స్వీకరించిన వెంటనే రాజధాని నిర్మాణాన్ని ప్రధమ ప్రాధాన్యతగా తీసుకున్నారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తేవాలని ఆయన భావించారు. అందులోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం ఉండటంతో ఇక వేగిరం పనులు పూర్తి చేసి రాజధానికి రూపు రేఖలు అందించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట అమరావతిని పక్కన పెట్టడంతో చంద్రబాబు మూడేళ్లలోనే చాలా వరకూ పనులు పూర్తి చేసి రాజధాని నిర్మాణానికి సొబగులుఅద్దాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎమ్మెల్యే, మంత్రులు, ఐఏఎస్ క్వార్టర్లు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో రోడ్లు, మెట్రో రైలు, రైలు మార్గం వంటివి వస్తే అమరావతి మరింత గా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News