ఇరుసుమండలో అదుపులోకి వచ్చిన మంటలు
కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ వద్ద బ్లో అవుట్ మంటలు అదుపులోకి వచ్చాయి
కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ వద్ద బ్లో అవుట్ మంటలు అదుపులోకి వచ్చాయి. గత ఆరు రోజుల నుంచి మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఇరుసుమండ వద్ద జరిగిన బ్లో అవుట్ తో పెద్దయెత్తున మంటలు చెలరేటి భారీ ఆస్తి నష్టం జరిగింది. అనేక కొబ్బరిచెట్లు మాడిపోయాయి. అయితే మంటలను అదుపు చేయడానికి ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందంతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు ప్రయత్నించారు.
వెల్ క్యాపింగ్ చేయడానికి...
చివరకు ఎట్టకేలకు మంటలను అదుపులోకి తేగలిగారు. వెల్ క్యాంపింగ్ చేయడానికి విపత్తు నివారణ బృందం ప్రయత్నిస్తుంది. ఆయిల్ ను తోడే బావిని మూసివేయాలని నిర్ణయించింది. బావి వద్ద అమర్చేందుకు బ్లో అవుట్ ప్రివెంటర్ ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది. మంటలు అదుపులోకి రావడంతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజలు తిరిగి తమ గ్రామానికి చేరుకుని తమ ఇళ్లను పరిశీలించుకుంటున్నారు.