Andhra Pradesh : నేడు బీజేపీ కీలక సమావేశం

నేడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర పదాదికారులు సమావేశం జరగనుంది

Update: 2025-10-22 03:55 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర పదాదికారులు సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అధ్యక్షత న విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో ఉదయం 10గం లకు పదాదికారులు సమావేశం జరగనుంది. రాష్ట్ర పదాదికారులు, బిజెపి ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, ఎంపి లు, మంత్రులు, కార్పోరేషన్ చైర్మన్ లు, జిల్లా బీజేపీ అధ్యక్షులు తదితరులు హాజరు కానున్నారు.

తాజా రాజకీయ పరిణామాలపై...
ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు రోడ్ మ్యాప్ ను రూపొందించనున్నారు. దీంతో పాటు జీఎస్టీ సంస్కరణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించనున్నారు.


Tags:    

Similar News