జగన్ పై ఫైర్ అయిన సోము వీర్రాజు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-07-19 12:25 GMT

somu fires on chandra babu

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాటలు హేతుబద్ధంగా లేవని సోము వీర్రాజు అన్నారు.పోలీసులు, అధికారులను జగన్ బెదిరిస్తున్నారన్న సోము వీర్రాజు ఇలాంటివి బీజేపీ సహించదని తెలిపారు. పోలీసులు చట్టం ప్రకారం తమ పని తాను చేసుకు పోతున్నారని, వారి విధులకు ఆటంకం కల్గించేలా మాటలు మాట్లాడటమేంటని సోము వీర్రాజు ప్రశ్నించారు.

నీటి పారుదల ప్రాజెక్టులపై...
నీటిపారుదల ప్రాజెక్టులపై జగన్ కు పూర్తిగా అవగాహన లేదన్న సోము వీర్రాజు బనకచర్లతో తెలంగాణకు నష్టం కలగదని అన్నారు. కేవలం మిగులు జలాలు మాత్రమే మనం తీసుకుంటున్నామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. జగన్ ఇతర రాష్ట్రాల అనుమతులు కావాలని చెప్పడం కూడా సమస్యను పక్కదారి పట్టించడమేనని సోము వీర్రాజు అన్నారు.


Tags:    

Similar News