Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఏసీబీ కోర్టు ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ఏసీబీ కోర్టు ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు అధికారులకు కోర్టు ఉత్తర్వులు అందినప్పటికీ ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. నిన్న ఏసీబీ న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవందప్పలకు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు అధికారులకు బెయిల్ పత్రాలను న్యాయవాదులు అందచేశారు.
విడుదల చేయకుండా...
ఈరోజు ఉదయం ముగ్గురిని విడుదల చేస్తామని నిన్న రాత్రి జైలు అధికారులు తెలిపారు. అయితే ఈరోజు విజయవాడ జిల్లా జైలు సూపరింటెండెంట్ బందరులో బస్సు ఎక్కారని, ఆయన వచ్చేంత వరకూ నిందితులను విడుదల చేయలేమని జైలు సిబ్బంది చెబుతున్నారు. జైలు అధికారులు కావాలని విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ప్రాసిక్యూషన్ హౌస్ మోషన్ పిటీషన్ వేసేందుకు సిద్ధమవుతుండటంతో వీరి విడుదలలో కావాలని జాప్యం చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. మరొకవైపు వారిని విడుదల చేయాలని కోరుతూ న్యాయవాదులు జైలు ఎదుట ఆందోళనకు దిగారు. అయితే చివరకు మూడు గంటలు డ్రామా తర్వాత నిందితులను విడుదల చేశారు.