పోలీసుల విచారణకు హాజరైన భూమన

తిరుపతి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు

Update: 2025-10-23 06:55 GMT

తిరుపతి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఎస్వీయూ పోలీసులు భూమనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితం పోలీసుల ఎదుటకు వచ్చారు. వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మృతిపై కొద్దిరోజుల క్రితం భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

టీటీడీపై ఆరోపణలు...
అయతే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఆరోపణలకు ఆధారాలను చూపించాలని, విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరారు. దీంతో విచారణకు హాజరయిన భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఆధారాలు చూపాలని కోరినట్లు తెలిసింది.


Tags:    

Similar News