ఏపీలో రోడ్డుపై బీర్లు.. దొరికిన వాళ్లకు దొరికినన్ని

రోడ్డుపై పడ్డ బీరు బాటిల్స్ కిందపడటంతో స్థానికులు బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు.

Update: 2022-05-22 07:40 GMT

ప్రకాశం: సింగరాయకొండ మండలం కలికివాయి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బీర్ల లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కన బోల్తా పడింది. రోడ్డుపై పడ్డ బీరు బాటిల్స్ కిందపడటంతో స్థానికులు బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. శ్రీకాకుళం నుండి మదనపల్లికి బీరు లోడుతో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

బీరు లారీ బోల్తాపడటంతో 1275 కేసుల బీర్లలో కొన్ని పగిలిపోగా, మరికొన్ని బీరు సీసాలను అక్కడి జనం తీసుకుపోయారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున సింగరాయకొండ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం నుంచి లారీ కింగ్‌ ఫిషర్‌ బీరుసీసాలతో మదనపల్లికి వెళుతుండగా రోడ్డు మీద సిమెంట్‌ దిమ్మెను ఢీకొట్టి బోల్తా పడింది. 1275 కేసుల బీర్లలో కొన్ని పగలిపోగా, మరికొన్ని బీరు సీసాలను దొరికినకాడికి ప్రజలు తీసుకుపోయారు. దాదాపు 30 లక్షల రూపాయల నష్టం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. కొందరు ఈ ఘటనలను వీడియోలలో రికార్డు చేశారు.
బీర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిందనే విషయం తెలుసుకున్న స్థానికులు, మందుబాబులు అక్కడి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రోడ్డుపై పడిన బీరు సీసాల కోసం స్థానికులు ఎగబడ్డారు. బీర్ బాటిల్స్‌కు జనాలు ఎగబడటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. రోడ్డుపై పడిపోయిన బీర్ బాటిల్స్‌ను జేసీబీ సాయంతో పక్కనే ఉన్న కాలువలోకి నెట్టారు. కొందరు కాలువలోకి దిగి మరి పగలకుండా ఉన్న బీర్ బాటిల్స్‌ను సేకరించారు.
కొద్దిరోజుల కిందట తమిళనాడులో ఇదే తరహా ఘటన:
తమిళనాడులోని మధురైలో ఇలాంటి ఘటనే కొద్దిరోజుల కిందట చోటు చేసుకుంది. సుమారు పది లక్షల విలువైన మద్యాన్ని రవాణా చేస్తున్న వాహనం మధురై సమీపంలోని విరగనూరు ప్రాంతంలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది. మద్యం సీసాలున్న పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గమనించిన స్థానికులు అందినకాడికి మద్యం సీసాలు, పెట్టెలను తమ వెంట తీసుకుపోయారు.


Tags:    

Similar News