కల్యాణదుర్గంలో ఎలుగుబంటి కలకలం
కల్యాణదుర్గంలో ఎలుగుబంటి సంచరిస్తుండటం కలకలం రేపుతుంది. ఎలుగుబంటిని చూసిన ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు.
bear roaming in kalyandurgam
కల్యాణదుర్గంలో ఎలుగుబంటి సంచరిస్తుండటం కలకలం రేపుతుంది. ఎలుగుబంటిని చూసిన ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. కల్యాణదుర్గంలోని కోటవీధిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ఎలుగుబంటి సంచాారాన్ని చూసిన గ్రామస్థులు కొందరు వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
గ్రామంలోకి రావడంతో...
అంతేకాకుండా ఎలుగుబంటి గ్రామంలోకి రావడంతో కొందరు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ ఉన్న ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు వచ్చారు. అయితే అప్పటికే అక్కడి నుంచి అది వేరే ప్రాంతానికి వెళ్లిపోవడంతో అటవీశాఖ అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ప్రజలు మాత్రం భయాందోళనలోనే ఉన్నారు.