Andhra Pradesh :ప్రకాశం జిల్లా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రకాశం జిల్లా దొనకొండలో ఆయుధ తయారీ పరిశ్రమకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి
ప్రకాశం జిల్లా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రకాశం జిల్లా దొనకొండలో ఆయుధ తయారీ పరిశ్రమకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కు 1400 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. మొత్తం 1200 ఎకరాల్లో పరిశ్రమను, మరో 200 ఎకరాల్లో టౌన్ షిప్ నిర్మాణం జరగనుంది. రాయితీ ధరపై భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బీడీఎల్ ఏర్పాటు చేయనున్న...
ఆయుధ తయారీ పరిశ్రమ స్థాపనకు రూ.1200 కోట్లు పెట్టుబడి బీడీఎల్ పెట్టనుంది. పరిశ్రమ ఏర్పాటుతో 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఏపీఐఐసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, నీరు, విద్యుత్, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దొనకొండకు విమాన సౌకర్యం కోసం చర్యలు చేపట్టాలని కూడా పేర్కొంది. ప్రొపెల్లెంట్ ఉత్పత్తి, ఆయుధ వ్యవస్థ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ స్థాపనకు ఆదేశాలు జారీ అయ్యాయి.